ఉల్లికాడలతో లిల్లీలు,ముఖాలు;- డా:కందేపి రాణిప్రసాద్

 పిల్లలు !ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు ' అని ఒక సామెత.సరే మీకు ఉల్లి శాస్త్రీయ నామం తెలుసా!తెలిసే ఉంటుందిలే. దాని పేరు ' 
ఎలియమ్ సీప; ఇది 'లీలియోసి' కుటుంబానికి చెందినటువంటిది.ఈరోజు ఉల్లి కాడలతో లిల్లీ పూలు మరియు మానవ ముఖాలు తయారు చేద్దామా.
మొదటగా ఉల్లి కడల్ని తీసుకొని ఆకుపచ్చని ఆకుల్ని కత్తిరించి వేయాలి.ముందుగా ముఖల్ని తయారు చేద్దాం.ఉల్లికున్న వేర్లు తల మీద జుట్టులాగా పనికొస్తాయి.లావుగా ఉన్న చివరి భాగం తల వలె ఉపయోగపడుతుంది అగ్గిపుల్లల్ని తలవైపు
చిన్నగా తుంచి కళ్ళవలె ఉల్లిపాయ లోపలికి గుచ్చాలి.నోటి కోసం చిన్నగాటు పెట్టాలి.ఆ గాటు లోనికి కొంచెం  కుంకుమను పెట్టాలి.ఎర్రని పెదవులు తయారయ్యాయి. ఇలా మూడు,నాలుగు ముఖాలు తయారుచేసి ఉంచుకోవాలి.
ఉల్లికి వేర్లున్న భాగం వైపు  ఈ ఆకారంలో కత్తిరించి 
వేర్లభాగం తీసివేయాలి.కింది కాడ భాగాన్ని పూల రెక్కల్లా కత్తితో కొయాలి.ఆ తరువాత వాటిని కొంచెం విడదీసి నీళ్లలో వేయాలి.కొద్దసేపటి తరువాత విచ్చుకున్న లిల్లీ పువ్వులా కనిపిస్తుంది.ఇలా ఐదారు పువ్వులు చేసుకోవాలి.ఒక గాజు పెన్ హోల్డర్ తీసుకొని దానిలో ముప్పా తిక  వరకు ఉప్పు పోయాలి.దాంట్లో ఈ లిల్లీలను ముఖాలను చక్కగా అమార్చాలి.ఉప్పులో పెడుతున్నాం కాబట్టి ఎక్కువసేపు వాడిపోకుండా ఉంటాయి.దీనిని అందంగా టి పాయి మీద అమరిస్తే బాగుంటుంది.
లీలియోసి కుటుంబపు మొక్కతో లిల్లిపూలు తయారు చేయటం బావుంది కదూ! 
కామెంట్‌లు