- 6 -
పెయింటర్ జగన్నాధం నన్ను... జ్యోతి ఫోటో స్టూడియోలో జాయిన్ చేసాడు !
అది మేడపైనఉండేది...ఆమేడ
మెట్లకి ఓ ప్రక్క వరండాలో ఓ టైలరింగ్ షాప్ ఉండేది !
మాగురువు ఎప్పుడూ స్టూడియో తాళాలు వేసేసి బయట నన్ను కాపలా ఉంచి.... ఔట్డోర్లే స్టూడియోలో ఉండేవారు కాదు !
నాకు ఆటైలర్లతోనే కాలక్షేపం !
ఆ టైలర్ పేరు మండ్ల గురయ్య
బోర్డు మాత్రం m g రాయ్ సూట్స్ స్పెషలిస్ట్ !!
ఆయన మంచి పనివాడే గానీ
పొట్టచించితే అక్షరం ముక్క లేదు... అతనే కాదు అతనిదగ్గర ఓ ఆరుగురు పనివాళ్లుండేవాళ్లు వాళ్ళ పరిస్తితీ ఆంతే...!!
ఎవరు బట్టలు కుంట్టించుకోటానికి వచ్చినా నన్నే పిలిచి బుక్ లో వాళ్ళ పేరు కొలతలు రాయించుకునే వాడు ! నన్ను అయ్యా గుమాస్తాగారు అని ముద్దుగా పిలిచేవాడు ! నేను సరదాగా
బట్టలకు కాజాలు కట్టటం...
గుండీలు కుట్టటం నేర్చుకునే వాడిని....మూడునెలలు గడిచింది... ఫోటోగ్రఫీ కి సంబం ధించిన పనేమీ నేర్పలేదు !!
ఇంతలో మాఊర్లోనే ఫేమస్ స్టూడియో ఉమాస్టూడియో...
అతను నన్నుపిలిచారు....
"నీకక్కడ ఎంతిస్తున్నాడు" అని అడిగారు... "రోజుకి అర్ధ రూపాయి... "అని చెప్పాను !" మేం
అరవై పైసలిస్తాం... పని నేర్పుతాం" అని చెప్పారు !
"నీ పేరేమిటి ?"అని అడిగితే... "నరసింహా రావు..."అని చెప్పాను
"నీ సీనియర్ ని గురువులు అని పిలుస్తాం...నిన్ను నరసింహులు
అని పిలుస్తాం... సరేనా...?"అని అడి
గారు... "సరే"నని తలవూపాను !
రోజూ ఉదయానే 8 గం. లకు
స్టూడియో తలుపులు నేనే తెరిచి... అంతా తుడిచి శుభ్రం చేసి...వాళ్ళు యేది తెమ్మంటే అది బజారునుండి తేవటం...
ఫోటో తీసేటప్పుడు... డార్క్ రూంలో వాళ్ళు పనిచేసే టప్పుడు హెల్పరుగా పక్కనుండటం !
ఇక్కడ ఆస్టూడియోగురించి... కొంచెం చెప్పాలి.
వాళ్ళు ఏడుగురు అన్నదమ్ములు, ఐదుగురు రైల్వే లో క్లాస్ 4 ఉద్యోగులు...
ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఫోటోస్టూడియో నడిపేవారు, !
పెద్దాయన రాంభట్ల ఉమా...
రెండో ఆయన నాగభూషణం !
మాపెద్దగురువు కెమెరాల్లో...
ఫోటోలు తియ్యటంలో ఘనుడు!
చిన్నగురువు... డార్క్ రూమ్ వర్క్, నెగెటివ్స్ పై టచింగ్...
ఫోటోలపై ఫినిషింగ్ బాగాచేసేవారు !
పెద్దగురువెప్పుడూ... షికార్లు తిరగటమే ! సుమారు రెండేళ్లలో... నేనో మంచి ఫోటోగ్రాఫర్... అల్రౌండర్ గా తయారయ్యాను... !
అరవైపైసలకిజాయినయినవాడ్ని... రోజుకు ఇరవై ఐదు రూపాయలు పుచ్చుకునే స్థితికి వచ్చాను !
**************
......... సశేషం !
బ్రతుకుబాట ..!! >పొట్టపోసుకోడానికి ఫోటోస్టుడియో!..>కోరాడ .నరసింహరావు > విశాఖపట్నం .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి