కలం స్నేహం ;-కాకరపర్తి పద్మజ
పల్లవి
చిలకపచ్చ చేలో సొగసుల చిలుక
ప్రేమగ చిట్టి నడుము మీద చిట్టి ముద్దే పెట్టాలే

చూపుల జోరుతో  నా వలపు గోరింక
అధరాల ముద్దులతో గుట్టే రట్టు చేసెయ్ రా..2సార్లు

చరణం
పిల్ల గాలి నర్తనం
సిగ్గు పూల పెత్తనమే
పరువాలకు పట్టం కట్టి …కలలను విప్పాలే
సలసల కాగే …సెగల రాజ్యం మనదేలే….
।। చిలకపచ్చ…

చరణం

కౌగిళ్ళ అత్తరు
పరవశాల మంత్రంతో
మల్లెల మత్తుల జోడీ కట్టి….ఊసులను దాచాలే
జలజల రాలే …. కవ్వింతల ఆజ్యం పోద్దాంలే
।। చిలకపచ్చ

చరణం
శుభలేఖకు చిరునామాల పసుపునద్ది
ఉషస్సు రంగుల కుంకుమనద్ది
మనసుల కలపోతకు ముహుర్త మెడదాం
కళ్యాణ సీమలో మనమొక్కటౌదాం


చరణం
వెన్నెల గంధాల వేడుకతో
వన్నెల వంతుల కానుకతో
నీ నా వయ్యారాల విందు
ఆరగిద్దాం…చీకటి విస్తరిలో…!! చిలకపచ్చ…….


కామెంట్‌లు