గీతాంజలి ; -రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 17."కరస్పర్శలో కరగాలని "
ఈశ్వరుని కరస్పర్శా భాగ్యాన్ని కోరుకుంటూ,చిత్రమైన భావనను చేస్తుంది భక్తురాలు. నీ కరస్పర్శలో కరగాలని, ఆ శుభముహూర్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాను. నీ కోసం ఎదురు చూసి, చూసి కాలం కరిగిపోతోంది. నేను నిర్వహించవలసిన బాధ్యతలను కూడా మర్చిపోతున్నాను. సంప్రదాయబంధాలు నాకు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. వాటిని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటాను. భౌతికదృష్టిలో నేను లక్ష్యసిద్ధి లేనిదానిగా ప్రజలచేత నిందలు పడక తప్పడం లేదు. ఎంతోమంది నన్ను తమవెంట తీసుకు వెళ్ళాలని ప్రయత్నించిన వాళ్ళు తమ కోరికలు నెరవేరక కోపోద్రిక్తులైనారు. నేను వృద్ధాప్యంతో పెనుగులాడుతున్నాను. నీలోనే లీనమవ్వాలని సంకల్ప బలంతో భక్తిపూర్వక నిరీక్షిస్తూ వున్నాను.

కామెంట్‌లు