నేలజారిన చంద్రవంక.;-అనూరాధ మేరుగుకలంస్నేహం
  పల్లవి :- 
( అతడు ):-
పచ్చని పంటల్లోనా వింజామరలు వీచేవేళా... వెచ్చటి పొద్దుల్లో మంచు దుప్పటి కప్పావే....
( ఆమె ):-
కన్యకల తీరంలో నవ వెలుగు నింపిన జాబిలివేరా ...
వెన్న మనసు కొల్లగొట్టి నీ వెనకే తిప్పావే....
( అతడు ):-
హృదయం నాదిలే సవ్వడి నీవులే...
పెదవులు నీవైనా పలుకులు నావిలే...
అడుగులు కోరే గమ్యం నీవై దరికి రావమ్మా...
// పచ్చని పంటల్లోనా// 
 చరణం:-(1):- 
( అతడు ):-
హే... శ్రావణ మేఘాల్లో సిరి పాదాల నర్తించీ.... నాట్యమయూరివై తనువే దోచావే....
నీలి తారకనీ లాగి నీ కొప్పున ముడిచీ...
గంధ సింధూర మందార సిగ్గు పులమనీ.....
విచ్చుకున్న పూల గుచ్ఛమల్లె మనసు మెచ్చెనే....
// పచ్చని పంటల్లోనా// 
 చరణం:-(2):- 
( ఆమె):- 
హా....రాగమాలికై రామచిలుకవై రంగులు నింపెయ్ పసిడిపైర గాలుల్లో....
నేల జారిన చంద్రవంక పెదవుటంచు తేనెపూసి
తారంగ అలల గలల తపన తెలుపనా....
వన్నె చిన్నె కలలు అన్నీ వెన్నెలూరే తిన్నెలే....
// కన్యకలతీరంలో //
// పచ్చని పంటల్లో//

కామెంట్‌లు