ప్రేమ మదనం ;-అన్యం పద్మజ రెడ్డి-కలంస్నేహం
తెలిమoచు ఉషోదయం
శుభోదయం చెబుతుంటే
వెచ్చని తేనీరు గొంతులో జారుతుంటే
ఒక సెల్ఫీ ప్లీజ్ అన్న 
నిన్నటి నీ పలకరింపు తాలూకు చిక్కదనం
తెలియని ఉత్సాహాన్ని
గుండెలోకి ఒంపుతుంది

ఏదో వలపు సందేశం అందుకున్న
ఎద కోయిల కంఠం సవరించి
ఓ మౌన రాగం ఆలపిస్తూ
పరువపు స్వరాలతో దోస్తీ కట్టి
ప్రేమ పావురమై తోడుకోసం పయనమైంది

నా వైపు సాగిన నీ మాటల్లో స్పృశించిన ఓ గుప్పెడంత స్నేహం 
గంపెడు ఆశలను దోసిట్లో నింపింది
మోయలేని తలపులని మనసారా అందించింది
మనకోసం ప్రేమ పొదరిల్లు అల్లింది

చెలిమి తీరం చేరిన నా బతుకులో
నీ నవ్వుంటే తిరణాల్లే వెన్నెల రాత్రులన్నీ....
నీ చూపులకు చెలరేగు మోహాల సందళ్ళన్నీ.....
మనజంట వేడుకలకు 
పరవశించే పసిడి పందిళ్లే......
ఇక మన జీవితమంతా కాపలానే ఆ రతీ మన్మధులే......


కామెంట్‌లు