కార్తిక మాసం - బాల గేయం ;-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
కార్తిక మాసం వచ్చింది 
కేదారవ్రతం తెచ్చింది 
నిష్ఠగా నోము నోచాలి 
హరుని దీవెనలు పొందాలి!

ఉభయ సంధ్యల్లో దీపాలు 
ఉన్నత హృదయం రూపాలు 
విభూతి ధారణ చేద్దాము 
విశ్వనాథుని కొలుద్దాము!

సోమవారమూ పవిత్రము 
శోభాయమానం శివాలయము 
అభిషేక ప్రియుని పూజల్లో 
అందరికి ఎంతో ఆనందము!

ఉపవాసఫలము అనంతము 
ఉపయోగం మరి  ఆరోగ్యము 
పండూ పాలు స్వీకరణము 
పరమ శివునిపై ధ్యానము!


కామెంట్‌లు