కలవరమాయెనా.. ఎదలో;--కలం స్నేహం-వాణీ రమణ
ఎచటి నుండి వచ్చినావో నీవు 
మది దోచి దోబుచులాడుతున్నావు
కలవో కల్పనవో ఎవరివో 
ఇలలో ఉన్నా కనిపించని భ్రమవో

వలచినావనుకుంటిని వదిలి పోవనుకుంటిని వలదని పోయితివి 

నా జ్ఞాపకాలలో నా బ్రతుకు పయనంలో నీవోక అమావాస్య చంద్రుడివై 
నాలో నీవై నాకై నీవు ఉన్నావని 
అనుకుంటిని

నా అంతరంగంలో తరంగమై
తరగని వనమై ధ్యానమై
ఉండిపోయావు
మది గదిలో మస్తిష్కంలో 
లీలగా అవలీలగా చేరి
తపించేలా నీకై పరి తపించేలా 
చేసావు మాయ చేసావు నన్ను 
నాకే కనపడకుండా మాయం చేసావు

కల వరమైనదో కలవరమవుతున్నదో
తెలియని పరిస్థితి 
కన్నీటి జాడలు పన్నీటి జల్లులైనవని 
మురిసితిని 

చెరగని నవ్వు నీవై పరిమళించే
సుమానివై తిరిగి 
రావా ప్రియతమా.....కామెంట్‌లు