రాధా మాధవం;-పద్మావతి. పి--కలం స్నేహం
నీలి మేఘం లా శోభించే నీలమేఘశ్యాముని సుందర వదనం
దివ్యతేజస్సులై వెలుగులు విరజిమ్మే
ముగ్ధ మనోహర సౌందర్యం
తొలి సంధ్యలో ఉషోదయ కిరణంలా 
కొంగ్రొత్త  కాంతులు చిందించే అధర సుధామృతం
పెదవులపై వెదురే వేణువై స్వర ఝరులను కురిపించే
సప్తస్వర రాగం
అరవిందంలా అరవిరిసిన ప్రేమలు పంచే శుభాశీస్సులు అందించే శుభసందేశం
స్నిగ్ధమైన సహృదయంతో మనసును మైమరపించే ఆధ్యాత్మిక అంతర్మధనం..
ఎద ఎదలో ప్రేమలు వీణియ మీటిన రాగములై పల్లవులై పాడిన రాధామాధవం
వని లో బృందావనిలో
కువకువలాడే గువ్వల జంటలా తన్మయమై మధురోహలే ఊయలలై ఊగిన ప్రేమవిహారం
ఆరాధనలే ఆత్మానందమై భావతరంగాల జలధిలో జలకాలాడిన 
సరస శృంగార రస మాధుర్యం రాధా కృష్ణుల ప్రణయ ప్రపంచం...


కామెంట్‌లు