-ఒంటరి కల--కావ్య నరేష్--కలం స్నేహం
ఒంటరి రాత్రులు ఎన్నో....
ఒంటిగా కన్న కలలు ఎన్నో.....
ఒంటరి పోరాటం ఎంతో.....
ఒంటరి నడకలు ఎన్నో......

ఒంటరిగా మిగిలిపోయా....
ఓటమినై చతికిలపడిన.....
ఒంటరి అనుభవాన్నై ఉన్న....
ఒంటి అనుభూతులను కన్న.....

ఒంటరి కథను నేను.....
ఒంటరి కన్నీటి చుక్కను నేను....
ఈ ఏకాంతములోన ఒంటరి తనంను.....
ఆనందాలు ఆవిరి.....
బంధాలు బరువు.....

నిస్సహాయత నా తనువు.....
నిలకడ లేని నా మనసు.....
నేనన్నది నేనేనా లేక వేరేనా.....
అర్థం లేని ఆందోళన నేను....


కామెంట్‌లు