దత్తపది-సాహితీసింధు సరళగున్నాల

 కడ ,మడి ,నుడి ,ముడి పదాలతో 
---------------------------------------------
మ*ముడినిన్వేసియు సంపదంత నొకచోమూటల్సదాగట్టినన్
మడియున్నెప్పుడొదానమింతనిడకన్ మార్మ్రోగు వ్యక్తిత్వమే
నుడువన్పెద్దల మాటనైన వినకన్ నోరెళ్ళతాబెట్టుగన్
కడకున్నుండదు కీర్తిసంపదలు నాకారంబుయేనిక్కమా
కామెంట్‌లు