*సూక్తిసుధ* *(కందములు)*;-*మిట్టపల్లి పరశురాములు*
పువ్వులతీరగఫరిమళ
నవ్వులకాంతివెలుగొందనవపౌర్ణమిగన్
మువ్వలుగలగలమ్రోగగ
గువ్వలజంటలునుమిన్నగుసగుసలాడెన్

పాపపుబుద్దులుకలిగిన
నీచపుమానవులచెలిమినిక్కమువిడువన్
శాపముతొలిగయునెప్పుడు
కోపమునిసుమంతలేకకోవిదుడగున్

ఇంటికిదీపమునింతియె
కంటికిరక్షకనుపాపకలియుగమందున్
మింటికితారలెరమ్యము
పంటకునెరువులనువేయపచ్చగనుండున్
                ****


కామెంట్‌లు