ప్రియతమా....;-సావిత్రి రవి దేశాయ్--కలం స్నేహం
కలలో కనిపించినా ఆనందమే
ఇలలో మురిపించినా సంతోషమే
కరుణించి క్రీగంట చూసిన చాలు
మరణాన్నైనా ఆహ్వానిస్తా...

నా మదిలో నీవనంతానివే, కానీ
నీ మదిలో నేశూన్యన్ని...
ఆహ్వానిస్తే ముళ్ళైనా పూల దారులే
మదిలో చోటిస్తే బాదైనా సుఖమే..

నీవు దరికోస్థానంటే, గాయమైనా
పరుగులు తీస్తూ రానా
నీ స్నేహం పంచుతానంటే, ఓటమైనా
విజయోత్సవాలు జరుపుకోనా...

నన్ను కాదనకు ప్రియ నేస్తం
అది అమృతపాణమైనా విషాన్నమే
ప్రేమించననకు ప్రియతమా...
స్వర్గంలో ఉన్నా నరకప్రాయమే అది...

నా ప్రేమ సామ్రాజ్యానికి మహారాణివై
నను ప్రియదాసునిగా  మార్చుకో..
ఇన్నాళ్లునీకై వేచి ఉన్న నా మదికి
ఆనందాన్ని అందించుచెలి ...


కామెంట్‌లు