ఓంశివాయ గురవే నమః! భక్తి యను గోవు"శంకర ప్రియ.," శీల., సంచార వాణి: ౭౭౧౨౭ ౬౭౦౯౮
 🙏సాధు లక్షణము గల
     సద్భక్తి యను గోవు
  
     పాలింపు మో స్వామి!
               ఓ సాంబ దేవ!
      ( సాంబ దేవ పదాలు., "శంకర ప్రియ." )
 🔱సాంబ శివుని యందు భక్తి భావన కలిగి యుండడమే.. "శివ భక్తి"! అది.. భక్త మహాశయులకు, కోటి జన్మల పుణ్య ఫలము గా లభించునది!
⚜️"భక్తి యను గోవు".. ఆరాధకులకు  అనంతమైన ఆనందామృతము నొసంగునది. పరమేశ్వరుని యొక్క గోశాలలో నున్నది. శ్రీ కైవల్య పదమును.. సాధకులకు ప్రసాదించు చున్నది.
          🔱ప్రార్ధనా పద్య రత్నము
          ( తేట గీతి )
అమిత మోదా౭మృతంబును అరయ నిచ్చు,
 విమల భవదీయ పాద గోష్టమున నుండు,
పశుపతీ! శివా! మత్పుణ్య ఫలము నైన
"భక్తి గోవు"ను పాలింపు! ముక్తి నిమ్ము!
   
       ( శ్రీ శివానంద లహరి., ఆంధ్రీకరణ: శ్రీ దేవుల పల్లి చెంచు సుబ్బయ్య శర్మ., )
   🙏ఓం నమః శివాయ! శివాయ నమః!

కామెంట్‌లు