సు (నంద) భాషితం;-*సునంద వురిమళ్ల ఖమ్మం*
 *సత్కార్యాలు*
****************
*మనుషులమన్నాక ఎన్నో కార్యాలు(పనులు), కొన్నైనా సత్కార్యాలు(మంచిపనులు) చేస్తుంటాం..*
*ఈ కార్యాలు గాలి వాటుగా అలా కొట్టుకు పోతూ కాలగర్భంలో  కలిసిపోతూ వుంటాయి.. అదేమంత పెద్ద విశేషం కాదు..* 
*కానీ*
*సత్కార్యాలు మాత్రం  గాలి వీచిన దిక్కే కాకుండా..* *అన్ని వైపులా వ్యాపిస్తూ సత్కార్యం యొక్క గొప్ప తనాన్ని, కీర్తిని చాటుతుంటాయి.* 
*.ఇంకా విశేషం ఏమిటంటే ఆ సత్కార్యం చేసే మనిషి యొక్క కీర్తి పరిమళాలను కూడా నలుదెసలా వ్యాపింపజేస్తాయి...*
 
*సుప్రభాత కిరణాల నమస్సులతో 🙏*

కామెంట్‌లు