వినోబాభావే ;-అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆధ్యాత్మిక వేత్తగా పెరిగిఎదిగావు!
భగవద్గీత సారాన్ని ఆపోసన పట్టి అన్నిభాషలలో వెలిగావు!
పల్లీయుల సమస్యలు ఎరిగావు!
బందిపోటులనే సాత్మీకులుగా
మార్చావు!
సర్వోదయ భూదానోద్యమాల నేతగా నిలిచావు!
పధ్నాలుగేళ్ళు డెబ్భైవేలమైళ్ల పాదయాత్రలే చేశావు!
నలభైరెండు లక్షల ఎకరాలు 
నిరుపేదలకు పంచావు!
భూదాన్ పోచంపల్లి పేరు 
మారుమోగేలా చేశావు!
రామన్ మెగసెసే అవార్డుఅందుకున్న తొలి మహానుభావుడవు భావే!
నీలాంటి వ్యక్తులు ఇప్పుడు కరువైనారే!?
అందరం మరిచాము నిన్ను!
భూకుంభకోణంలో రొట్టెముక్క 
పంచుకునే పిల్లులం అయ్యాము చూడు!?
కామెంట్‌లు