ప్రకృతిగీతం-గీత శ్రీ స్వర్గం-కలం స్నేహం
నే భువిపై పుట్టకముుపే 
నా చుట్టూ చేరి స్వాగతం పలుకుతూ
ఓ గుప్పెడు స్నేహమై నన్ను అల్లుకున్నావు

నీ నవ్వుంటే‌ తిరణాల్లే నాకన్నట్టు
మట్టిపరిమళాలతో పిలిచి
పచ్చనిఒడిన పరుగులెత్తించి
ఆటకు ఆలంబనవై నిలిచి
పక్షుల తీరైనరావాలతో పాటల కచేరియందు మైమరిపించి
చిన్నారిస్నేహమై ఎంత మమకారం రంగరించితివో 

పసిపాప పాలమోములా ఎక్కడికెళ్ళినా ఎదురేవుంటూ
తాజాగంధాల తళుకులు చిందిస్తావు పొంగిన ప్రౌఢవయసుకి ప్రతీకవై
 నీతో ఒక సెల్ఫీ ప్లీజ్ అనాలనిపించేలా
రమ్యమైన వర్ణశోభలతో
మనోరంజితమైన దృశ్యాలతో కళ్ళను కట్టేస్తావు ఎంతటివారలనైనా 

అలికిడిలేని తుఫానులా వచ్చే ఉపద్రవాలను దరికి రానీకుండా 
జీవితమంతా కాపలానే కాస్తానంటావు హితైషిగా
వికృతతలల తలంపులను తలకిందులుచేసేపుడు మాత్రం నాలో నిజమైన మనిషిని గుర్తుచేస్తుంటావు

ఓ మౌనరాగంలా 
నీతో అంతటి అనుబంధం ఏమిటో తెలియదు గాని ఓ ప్రకృతిగీతమా...!
అమ్మలాంటి లాలన 
నాన్నవంటి బాధ్యతలా అనుభూతమౌతావు  చిటికెనవేలుపట్టి చితివరకు సాగనంపే దాకా నాకునీడవై తోడువై ఉండే నీకు శతసహస్ర జోతలివిగో...!!


కామెంట్‌లు