భోగరాజు పట్టాభి సీతారామయ్య! అచ్యుతుని రాజ్యశ్రీ

 రైతుబంధుగా అన్నదాత సుఖీభవగా వెలుగొందావు!
ఇంటిపేరు భోగరాజు ఐనా
బాల్యమంతా బీదరికం!
నాల్గవ ఏట తండ్రి మరణం!
తల్లి బంధువుల అండదండతో
ఎం.బి.సి.ఎం.పాసై వైద్యవృత్తిలో రాణించావు!
ఆంధ్రాబ్యాంక్ స్థాపకుడా!
రైతుల పాలిటి ఆపద్బాంధవుడా!
తెలుగు రాష్ట్రంకావాలన్నావు!
తెలుగు భాష నే మాటాడమన్నావు!
మరిచిపోము నీవేషభాషలు!
సదా నిలిచేవు తెలుగు గుండె లో!
కామెంట్‌లు