సు (నంద) భాషితం*--*సునంద వురిమళ్ల,ఖమ్మం*
     *దీపం*
******************
*దీపం చుట్టూ ఉన్న చీకటిపై వీరోచిత పోరాటం చేసి*
*వెలుగుల చైతన్యాన్ని నింపుతుంది.*
*అపజయాల చీకట్లను పారద్రోలి*
*ఆనందాల వెలుగులను పంచుతుంది.*
*అందుకే*...
*చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా మనమంతా దీపాలను వెలిగిద్దాం.*
*మనసుల్లోని అజ్ఞానం,*
*ఆవేదన చీకట్లను తొలగిద్దాం*
*సంతోషాల మతాబులతో సంబురంగా  దీపావళి పండుగ జరుపుకుందాం*.
 *సుప్రభాత కిరణాల నమస్సులతో🙏*


కామెంట్‌లు