నిలిచే ప్రణయ కావ్య మై!;-సుధ జగదీశ్-కలం స్నేహం
రాధమ్మ మనసు నిండా  కలవరింతలే...
నందకిశోరుని తలచి,వగచి.. బ్రిందావనిలో..
నిరీక్షణ ల నిట్టూర్పు లే..
వేణుగాన లోలుని పరిష్వంగన లో బలపడిన ఓ గుప్పెడంత స్నేహం, 
ప్రణయ గంధమై పరిణమించి
వనమంతా వెదజల్లే  సౌర భాల మకరందం..
క్షణమైనా విడదీయలేని అనుబంధపు చందనం..

ఘడియ అయినా ఓప జాల మాధవా!
నీ రాకకై జీవితమంతా కావలే నా?
కరుణించ జాగేలా!! అన్న రాధమ్మ ఆక్రోశం...
మలయమారుత తరంగాలతో కలసి పల్లవించెను ఓ మౌన రాగం ..
చల్లని వెన్నెల సాక్షిగా, విరిసి వాడిన కుసుమముల సాక్షిగా..
 మారి చేరే మబ్బుల లోనికి.. మేఘ సందేశమై
మనసు కరిగి మబ్బులు వర్షించిన వలపు ధారల సందేశపు సౌగంధం..
అందుకుని పరుగున ఏతెంచిన మనోహరుని కటాక్షం..

తనువు,మనసు అర్పించి ప్రియుని మ్రోల వాలిన రాధ అంతరంగం..
నీ నవ్వు ఉంటే తిరునాళ్ళు..
కలకాలం నీ చిరునవ్వుల వరమియ్యవా..
నీ దరహాస చంద్రికల శోభను గా వెలుగనివ్వవా...
అని వేడిన ఆ  అద్వితీయ సుమధుర క్షణం...
పులకరించి పరవశించి న ప్రకృతి కాంత ..
తన మది ఫలకం పై ప్రతిష్టించి తరియించుటకా అన్నట్లు..
ఒక సేల్ఫీ ప్లీజ్ అని కొంటెగా..
చిత్రీకరించిన అన్యోన్య ప్రణయ సంగమం!
కలకాలం జగతి కి మిగిల్చిన అమరమైన ప్రేమ కావ్యం!!


కామెంట్‌లు