గీతాంజలి ;- రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 20. నేనెరుగని నా పరిమళం నువ్వు ప్రసాదించిన జ్ఞాన అనుగ్రహమని తెలుసుకోలేక పోయాను. నీ పూజకు వినియోగించే నా పూల బుట్ట ఖాళీ అయిందనుకున్నాను. నా ప్రారబ్దకారణంగా అందులో ఇంకా ఒక వెలలేని పుష్పం మిగిలే వుండటాన్ని గమనించలేక పోయాను. అది తెలుసుకొని స్పృహలోకి రాగానే నాకు దిగులు వేసింది. దక్షిణ వైపునుంచి వీచే శీతలపవనాలతో వచ్చే సువాసన ఎక్కడ నుంచి వస్తుందో తెలియక నా మనసు కలవర పడుతుంది. నాచుట్టూ వ్యాపించి వుండి నాకు ఎడంకాని, ఈ సంపూర్ణ మధుర పరిమళం నా హృదయంలోనే అంకురించి, వ్యాపిస్తుందనీ, ఈ సుమధుర సుగంధమంతా నా సొంతమేనని అప్పుడు గ్రహించలేకపోయాను.కామెంట్‌లు