స్వామీ వివేకానంద బాల్యం!అచ్యుతుని రాజ్యశ్రీ

 బాల్యంలో వివేకానందని తల్లి భువనేశ్వరీదేవి బీరేశ్వర్ అని పిలిచేది.స్నేహితులు  బిలే అనేవారు. బడిలో పేరు నరేంద్ర నాధ్.కానీ నరేన్ అనే అంతా పిలిచేవారు. తల్లి రోజు శివార్చనచేసేది. శివానుగ్రహంవల్లనే అందమైన కొడుకు పుట్టాడని మురిసిపోయేది. పెద్ద పెద్ద కళ్ళతో అందంగా ఉండే నరేన్ మహాఅల్లరి దుడుకు.తల్లి నెత్తిన నీరుపోస్తూ ఓం నమ:శివాయ అని అంటూండేది అల్లరి చేయను అని నరేన్ అన్న తర్వాతే నెత్తిన నీళ్లు పోయటం ఆపేది.
 బైట ఎవరన్నా బిచ్చగాడు అడుక్కోటానికి వస్తే  ఇంట్లో తనచేతికి అందిన వస్తువు ఇచ్చి పంపేవాడు.ఇలాకాదని తల్లి మేడపైగదిలో పెట్టి తాళం వేస్తే కిటికీలో నించి కిందకు విసిరేవాడు.అందుకే భిక్షగాళ్లంతా ఆకిటికీ కింద నించుని అరిచేవారు.తన11ఏళ్ళ వయసులో కలకత్తా కి యుద్ధనౌక వచ్చింది. చాలా మంది దాన్ని చూట్టానికి వెళ్లారు.బ్రిటిష్ ఆఫీసర్ పాస్ ఇస్తేకానీ అది సాధ్యంకాదు. స్నేహితుల ప్రోత్సాహంతో క్యూలో నించున్నాడు.వాచ్మన్ గేటు దగ్గర అటకాయించాడు."ఏయ్ పిలగా!నీవు చాలా చిన్న వాడివి.ఆఫీసర్ నిన్ను చూడడు."కానీ మొండిగా నరేన్ అక్కడున్న మెట్లు ఎక్కి  ఆబ్రిటిష్ ఆఫీసర్  గది లోకి అడుగు పెట్టాడు. తనకున్న ఆంగ్లభాషాపరిజ్ఞానంతో అప్లికేషన్ స్వయంగా రాసి ఆయనముందు పెట్టాడు.ఆపిల్లాడి ధైర్యసాహసాలకుఆఫీసర్ మెచ్చుకుని వెంటనే పాస్ జారీచేశాడు.ఫ్రెండ్స్ అంతా ఖుషీగా చప్పట్లు చరిస్తే  వాచ్మన్ బిక్కమొహం వేసుకుని ఉండిపోయాడు. క్లాసులో మాష్టారు పాఠం చెప్పేటప్పుడు పక్క పిల్లలతో మాట్లాడేవాడు.ఇది గమనించిన మాష్టారు నరేన్ ని లేపి అడిగితే ఆయనచెప్పిన దంతా తు.చ.తప్పకుండా అప్పగించాడు. "మాష్టారూ!నేనే  మీరు పాఠం చెప్పేటప్పుడు మాట్లాడాను"అని నిజం చెప్పాడు.తోటలో చెట్లపై ఎక్కి కోతికొమ్మచ్చులు ఆడేవాడు. తోటమాలి పిల్లలను బెదిరిస్తూ"చెట్లపై దెయ్యాలున్నాయి.దిగండి "అంటే నరేన్ రెచ్చగొడుతూ "నాకు కనపడటంలేదు. నీవు ఎక్కి మాకు చూపు"అని పకపకానవ్వేవాడు.భయపడగూడదు.ధైర్యంగా  పరిస్థితులను ఎదుర్కొనాలి అనేది ఆయన భారతీయుల కు ఇచ్చిన సందేశం!రామకృష్ణ మఠంని బేలూరులో నెలకొల్పి స్వామి వివేకానంద పేరుతో ప్రపంచ ఖ్యాతి గాంచాడు.హైదరాబాదు లో ఉన్న రామకృష్ణ మఠంని ప్రతివారూ సందర్శించాలి.వాలంటీర్లుగా దేశంలో  ఎక్కడ విపత్తు వచ్చినా నిస్వార్థసేవచేస్తారు.బాలలు యువత ఆయన చెప్పినట్లుగా "భారత దేశం కోసం  సింహాలై గర్జించాలి.ఆయన జీవితచరిత్ర ప్రతివారూ తప్పకుండా చదివి తీరాలి.
కామెంట్‌లు