రైతన్న--సంధ్యా శ్రీనివాస్--కలం స్నేహం
అన్ని జీవుల ఆకలి తీర్చే రైతన్నా
నీకు వందనమన్నా
శ్రమయే నీ జీవన విధానమన్నా
అలుపు సొలుపు అసలెరుగవన్నా
ఎండా వానలు నిన్నేమీ చేయలేవన్నా
భానోదయమే నీ సమయమన్నా
సూర్యాస్తమయమే నీకు తెరిపన్నా
మట్టితోనే నీ సావాసమన్నా
అలసి పోతే చెట్టు నీడనే నీకు విశ్రాంతన్నా

పొలం పండితే నీకు మోదమౌనన్నా
దిగుబడి లేకుంటే నీకు ఖేదమన్నా
కష్టాల్ నష్టాల్ ఎన్నొచ్చినా నీ శ్రమ కొనసాగించే కృషీవలుడవన్నా 
నీ కృషియే మా క్షుద్భాదను తీర్చునన్నా
ప్రాణులకు ఆహారన్నందించే దేవుడవన్నా
అందరి ఆకలి తీర్చే ఓ రైతన్నా
నీ బాధలు తీర్చే నాథుడెవరన్నా
జనులంతా నీకు ఋణగ్రస్తులే కదన్నా
నీ కృషికి అందుకో మా వందనమన్నా

కామెంట్‌లు