సు(నంద) భాషితం;- *సునంద వురిమళ్ల ,ఖమ్మం*
  *చిత్తశుద్ధి*
********************
*ప్రతి వ్యక్తికి చిత్త శుద్ధి ఉండాలి*
*ఆ చిత్త శుద్ధే వ్యక్తి యొక్క అస్తిత్వాన్ని చాటుతుంది*
*చిత్తాన్ని ( మనస్సును) శుద్ధి చేసుకోకుండా  ఎన్ని పూజలు చేసినా, మరెన్ని నదులలో మునిగి దేహాన్ని శుద్ధి చేసుకున్నా...* *కల్మషం నిండిన మనసు చేసే  పనులు, వాటి ఫలితాలు కల్మషంగానే ఉంటాయి.*
 *అందుకే* *చిత్తాన్ని ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో శుద్ధి చేసుకుంటూ.*. *మానవతా విలువలను నింపుకోవాలి.*
*అప్పుడే చిత్తశుద్ధి కలిగిన దేహం చిన్మయానందంతో వెలుగుతుంది..*
 *సుప్రభాత కిరణాల నమస్సులతో🙏*


కామెంట్‌లు