సవ్వడులు;-డాక్టర్ రాధా కుసుమ--క లం స్నేహం
నేటికీ బంద్రంగా దాచుకున్నాను
నా గుండె అల్మారాలో 
నాడు నీవిచ్చిన మువ్వల పట్టీలు...!

ఎదలో దాచుకున్న నాటి 
అపురూప అనుభూతుల సవ్వడులు
నేటికీ తలుపుల పరదాలలో
దాచుకున్న  జలతారు వెన్నెలలు..! 

దూరమైనా చెంతనే
మిగిలిన ఆ వాసంత
సమీరాలు
నీవు విసిరేసిన
అనుమానపు మేఘాలలో నిశబ్దంగా
మ్రోగక మూగబోయిన
కాలి అందియలు...!

నీ రాకకై ఎదురు చూస్తున్న కోయిలనై
మొగులు వర్షంలో తు
తడవాలని
నీ పదాల పల్లవులతో 
నా పాదాల గజ్జెల చరణాలు
ఏకమై చేసే రవళులలో 
మురవాలని ఎదురుచూస్తున్నా
రాధికనై...!

కామెంట్‌లు