*"అమ్మ"* *కందపద్య ద్వాదశి*; --*మాడుగుల మురళీధరశర్మ**కాళేశ్వరం-సిద్ధిపేట*
 *కం:-1*
*అమ్మ* ను రెండక్షరములు
నిమ్మహిలోమంచిచెడుల*
నిహపరమందున్!
నెమ్మనమునస్మరియించగ
కమ్మని నీపదముటమ్ము*
కమనీయముగా!
*కం:-2*
అమ్మను కమ్మని భావన
సమ్మతిగాసకలజనుల*
సరసనరసనన్!
ధమ్మిల్లమ్ముననిండెను
అమ్మాయనుపదపుటర్థ*
మతిమధురముగా!
*కం:-3*
కొమ్మను,నమ్మా,,యమ్మీ,
మమ్మీ.నాయీగ,నవ్వ*
మాతా,తల్లీ!
నమ్మకమునపలుభాషల
గుమ్మగతాపిలుచుచుంద్రు*
కూర్మిని జనులున్!
*కం:-4*
కులమతవర్గరహితముగ
తలపున,వలపుననుకాల*
ధర్మప్రకృతిలో!
నెలతగజీవులజననిగ,
తొలిగురువుగనమ్మలేని*
తుఛ్ఛుడుగలడే!
*కం:-5*
ప్రకృతిక ధర్మము నమ్మగ
సకృతముగాదైవప్రోత*
సౌభాగ్యముగా!
రకరకములజీవాణువు
ప్రకటితమగుజీవజాతి*
పరిణామమ్మే!
*కం:-6*
అమ్మన ప్రేమకు రూపము
అమ్మన నమృతమ్ముపంచు*
నధిదేవతగా!
అమ్మలగన్నమ్మలుగా
నమ్మాతృకలైవెలుంగు*
గామువురమ్మల్!
*కం:-7*
శాస్త్రావలోకనమ్మున
నాస్త్రీలేనమ్మలెపుడు*
ననవరతమునన్!
శస్త్రాస్త్రసారమిదియే
శాస్త్రీయముసర్వజీవ*
సంతతికనుమా!
*కం:-8*
పార్వతి,లక్ష్మీ,వాణీ
సర్వోన్నతపాదిశక్తి*
సారమతీంద్రుల్!
సర్వాంతర్యామినులై
నిర్వాహకజీవతతులు*
నిజమగుప్రకృతిన్!
*కం:-9*
అమ్మనుమించినదైవము
నిమ్మహిలోలేదుచూడ*
నేవిధమైనన్!
అమ్మలచుల్కనచేయక
నెమ్మనముననమ్మికొల్వు*
మేమరకనే!
*కం:-10*
అమ్మలమనమునకనువుగ
కొమ్మలునేతరమునందు*
కోడండ్రైనా!
అమ్మగనత్తలకనుడీ!
కుమ్ముచువృధ్ధాశ్రమముల*
కుంఁబంపకుమా!
*కం:-11*
స్త్రీగానీవొకనాడిల
సాగుచునత్తగనుమార్పు*
సహజముకాదా!
రాగముద్వేషములనువిడి
త్యాగిగవృధ్ధులనుకావు*
ధర్మము నమ్మా!
*కం:-12*
అమరమునమ్మదనమ్మగు
సమరముసద్భావనలను*
సంప్రాప్తించన్!
నెమరుగనమ్మమ్మమ్మల
కమనీయపుజ్ఞాపకముల*
గనువర్తనమున్!
           *****

కామెంట్‌లు