-ఉద్యానవనం;-అరుణ బట్టువార్-కలం స్నేహం
 అరుణారుణ కిరణాలు నేలను తాకే ఉషోదయాన హృదయ సుగంధం నిచ్చే పరిమళభరితమైన ఉద్యానవనానికేగాను
అచ్చమైన స్వచ్ఛమైన మచ్చ లేని తెల్లని మల్లెలు అన్ని 
గమ గుమల సువాసనలతో నా మనసుని గుచ్చి గుచ్చి ఆకర్షించ సాగాయి వాటిని
త్రుంచ భోగ
మంచిగంధం వలె సుహాసన వెదజల్లే రంగు రంగుల అందాలొలికే గులాబీలు 
రా రమ్మని నా మదిని పిలువ సాగే
ముగ్ధ మనోహరమైన ముద్ద మందారాలు ముచ్చట గొలుపుతూ రెక్కలను విప్పారిస్తూ మురిపెంగా మురిపించే సాగే
సత్యభామ మెచ్చిన అచ్చమైన స్వచ్ఛమైన పారిజాత కుసుమాలు విరగబూసి నేలకొరిగి నవ్వుతూ నన్ను ఆకర్షించసాగె.
ఆ నందనవనాన అందమైన సీతాకోక చిలుకలు పరిమళించు విరుల పైవాలి
నా కన్నులకు ఎంతో కనువిందు చేయ సాగే.
చిన్ని తుమ్మెదలు పుష్ప కేసరాల పై వాలి మకరందాన్ని జుర్రుతూ నా మదిని మైమరపించ సాగె
మయూర మంద గమనాలు
కోయిల కుహు కుహూరాగాలు
తుమ్మెద ఝంకారాలు
రా చిలుక మ్మల కిలకిలల
 స్వర ధ్వనులు నా హృదయాన్ని రాగరంజితం చేసే.

కామెంట్‌లు