:ఇకనైనా మారు ....సావిత్రి రవి దేశాయ్.... కలం స్నేహం
నిజానికి మారుతున్నదెవరు..
నీవే కానీ మరొకరు కాదుకదా 
జీతం కోసం జీవితాన్ని తాకట్టు పెట్టి
ఉరుకులు పరుగులు తీసేవారెవరు 

అయిన వారి పలకరింపులకు
సైతం నోచకుండా అర్ధ సంపాదనే
ధ్యేయంగా క్షణం తీరిక లేక
బతుకుతున్నది ఎవరు నీవే కదా...

సన్నిహితుల ఎదుగుదల చూడలేని
అంధుడివి...
తల్లిదండ్రులను పోషించలేని
అర్భాకుడివి 
తోబుట్టువుల పలకరింపులు లేని
దౌర్భాగ్యుడివి ...
దీనికి కారణం ధనం పై మోజు పడ్డ నీవే కదా...

ప్రసంశలతో, గణిక పత్రాలతో జ్ఞానం
వస్తుందంటే అది నీ అజ్ఞానమే...
గూడు కోసం నీడను నరికే నీకు
మరొకరిని విమర్శించే హక్కు ఎక్కడిది

ఓ మనిషి ఇకనైనా మారు..
కాసులపై మొహం వదిలేయ్
పుట్టినప్పుడు తేలేనిది
పోయేటప్పుడు వెంట బెట్టుకు
పోయేది, నీవు చేసిన మంచి
మాత్రమే అని తెలుసుకో....
మారి మనిషిలా మసలుకో....


కామెంట్‌లు