కలం స్నేహం : గీతాశ్రీ స్వర్గం
 M
మరదలా పచ్చిపాల జున్నులాంటి పరువం నీదే
కొత్తగా వన్నెకొచ్చిన పైరులా మనసుదోచావే
F
వింతగ ఎన్నో చెప్పే నీ కన్నుల తోటలోనే
సిగ్గుల పూవల్లే నన్ను నేను మరిచాలే
M
జారిజారి పోతునే
జాతరలే చేస్తావే
ఊరకనే ఉంటునే 
గుండెలో గూడవుతావే
సరసన విరిసిన కలలోన కౌముది నువ్వేలే
చిత్తుచేయకే చిన్నీ..
ముద్దుగా నువ్వునేను చినుకుచిగురై ఉండిపోదాం
గుప్పెడు ప్రేమల్లే నన్ను హత్తుకున్నావులే
F
కత్తిలాంటి ఆడపులిని కవ్వించే ఖిల్లాడివే
మత్తుమందు లేకుండానే నీ చుట్టు తింపావులే
M
హే... నవరత్నాలే పండెగా ఎదపొలమంతటా
నీనవ్వులే నవలోకం చూపుతుంటే
ఆ ఇంధ్రధనస్సునే కానుకివ్వనా ప్రేమగా
పూలుపరిచేయనా నువు నడిచే దారిలోన
కట్టానే పోరి నీకు గుండెల్లోనా వలపుకోటనే 
వరదలా పొంగే..
మరదలా పచ్చిపాల జున్నులాంటి పరువం నీదే
కొత్తగా వన్నెకొచ్చిన పైరులా మనసుదోచావే
F
మనసైన మధురిమా నన్నే అర్పించనా
అంతరంగమృదంగం ఈ మోగేవేళ
సింధూరం నుదుటనా తొలిపొద్దులా మురిసెనా
నడకలో యమునే నాట్యమాడేనురా
జతగా నువ్వుంటే జరిగేను ఎన్నో మాయలే..

కామెంట్‌లు