గీతాంజలి రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 5. నీ నన్నిధి పాడ వేడెద
ప్రపంచమనే ఆస్థానంలో పాడేందుకే నేనున్నాను. నీ దర్బారులో గానం చేయడానికి నాకో చిన్న స్థానం దయచేయి ప్రభూ... ఈ లోకంలో నాకంటూ వేరే పనులేవీ లేవు. నిశ్శబ్ద చీకటిరాత్రి ఆలయంలో హారతి గంట మోగే సమయంలో నీ సమక్షంలో పాడేందుకు నాకు అనుజ్ఞ దయచేయమని ప్రార్ధిస్తున్నాను. ఉదయ సంధ్యా వాతావరణంలో బంగారు వీణను నేను శృతి చేస్తుండగా కనిపించి నాకు తరించే భాగ్యాన్ని దయచేయి ప్రభూ.... 

కామెంట్‌లు