మెదడు కొత్త ముఖాల్ని సృష్టించలేదు!? సైన్స్ వ్యాసంప్రతాప్ కౌటిళ్యా ( కె ప్రతాప్ రెడ్డి)
 
సాధారణంగా మనం ఏనుగును పులిని సింహాన్ని అలాగే అన్ని జంతువులను చూడంగానే ఆ జంతువు ఏదో గుర్తిస్తాం. కానీ అలాగే ఏనుగుల గుంపు లో ఒక ఏనుగును పులుల గుంపులో ఒక పులిని సింహాల గుంపు లో ఒక సింహాన్ని గుర్తించడం కష్టమవుతుంది. అంటే జంతువుల జాతులను గుర్తిస్తాం కానీ ప్రత్యేకంగా గా సమూహంలో ఏ జంతువు అన్నది గుర్తించలేము.

సరిగ్గా అలాగే మనం కలలో చాలా విషయాలు కలగంటాం కానీ కలలో కనిపించే ఏ జంతువైనా వస్తువు అయిన ఉన్నది ఉన్నట్లుగా గుర్తిస్తాం. దీంట్లో కూడా మనం జాతుల ను గుర్తిస్తాం తప్పా ప్రత్యేకమైన ఒక జంతువు గుర్తించలేము మరియు మనుషులను కూడా అంతే, మనకు కలలో కనిపించిన వ్యక్తిని మనం కొంతకాలం తర్వాత గుర్తిస్తాం.

అంటే కలలో వచ్చే వ్యక్తులు మనకు పరిచయం ఉన్న వాళ్లు మాత్రమే కాక మనకు పరిచయం లేని వ్యక్తులు కూడా ఉంటారు. కానీ నీ పరిచయం ఉన్న వ్యక్తుల్నీ మనం గుర్తిస్తాం. వస్తువులైన అంతే. కొన్నిసార్లు కలలో మనం గుర్తించని వస్తువుల్ని వ్యక్తుల్ని కూడా చూస్తుంటాం. అంటే ఫాంటసీ ఇమేజినేషన్ లో జరిగే సృజనాత్మకత వల్ల మనుషులు వస్తువులు మారినట్లు మనం గుర్తిస్తాం. కలలో వచ్చేవన్నీ మనం విన్నవి చూసినవి చేసినవి మాత్రమే కాక పరిచయం లేనివి కూడా మెదడు సృజనాత్మకత వల్ల వస్తుంటాయి. కనుక పరిచయం లేని గుర్తించలేని ముఖాల్ని మనం అప్పుడప్పుడు చూస్తూవుంటాం. కానీ మెదడు పరిచయం లేని ముఖాల్ని సృష్టించి మనకు చూపించదు కానీ కలలో అలా జరుగుతుంది.

అంటే పరిచయం లేని కొత్త మనుషుల ముఖాల్ని మెదడు సృష్టించలేదని అర్థం. దేన్నైనా ఉన్నదాన్ని చూసిన దాన్ని విన్నదాన్ని చేసిన దాన్ని మాత్రమే మెదడు గుర్తిస్తుంది. అలా కాకుండా కొత్త ముఖాల్ని కొత్త వ్యక్తుల్ని మెదడు సృష్టించలేదు. వస్తువుల్ని కూడా అంతే. ఏం జరిగినా పరిచయమున్న వ్యక్తుల ముక్కల్ని మాత్రమే మెదడు గుర్తిస్తున్నది శాస్త్రీయ భావన.

కానీ నీ జంతువుల్లో ఒక జంతువు ఎలా గుర్తించలేమో కానీ మనుషుల్లో ఒక మనిషిని తప్పనిసరిగా గుర్తిస్తాం. అంటే మెదడు పరిచయమున్న ముఖాన్ని మాత్రమే స్పష్టంగా గుర్తిస్తుందన్నదీ అర్థం. సరిగ్గా అలాగే జంతువులు కూడా సమూహంలో వాటి వాటిని ప్రత్యేకంగా గుర్తించే సామర్థ్యం మెదడుకు ఉంటుంది. అలాగే జంతువుల మెదడు కూడా కొత్త ముఖాల్ని సృష్టించ లేవు. పరిచయం ఉన్నా ముఖాల్ని మాత్రమే గుర్తిస్తాయి. అది మనుషుల్లో కూడా అంతే. అంటే మెదడుకు కొత్త ముఖాల్ని కొత్త వ్యక్తుల్ని కొత్త వస్తువుల్ని సృష్టించే సామర్థ్యం లేదని అర్థం.

కానీ సృజనాత్మకత తో ఫ్యాంటసీ లో ఇమేజినేషన్ లో అలా జరుగుతుందని చెప్పడానికి కారణం మనం కంటున్న కలలు. అంతే తప్ప పరిచయం లేని ప్రాణుల్ని వస్తువుల్ని వ్యక్తుల్ని కొత్తగా సృష్టించీ గుర్తించే సామర్థ్యం మెదడుకు లేదు. ఏదైనా విన్నది చూసింది చేసింది మాత్రమే మెదడు జ్ఞాపకశక్తిలో చోటు చేసుకుంటుంది. అది కూడా మనం చేసింది 90% చూసింది ఏబై శాతం విన్నది 10 శాతం మాత్రమే పసిగట్టే సామర్థ్యం మన మెదడుకు ఉన్నది.
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు