తన్నీరు-కన్నీరు...!!> కవిత: --అడ్లూరు నరసింహమూర్తి .హన్మకొండ.
ప్రభుత్వ పథకాలు 
'పతకాలు' గా మారాయి...!

కోట్లకు ఓట్లు రాలలేదు...

అహంకారం మీద 
ఆత్మ గౌరవం గెలిచింది..!

'తన్నీరు' కు కన్నీరు మిగిలింది..

' గెల్లు ' గొల్లుమన్నాడు..!

కాంగి ' రేసు ' లో 
లేకుండా పోయింది...!

స్వతంత్రులు   
అ'స్వతంత్రులు' అయ్యారు...!

' ఈటల ' కోటలు 
బీటలువారలేదు..!

 కమలం వికసించింది...

' బండి'., ' కారు ' 
ఢీ కొట్టుకున్నాయి..!
కారు నుజ్జు నుజ్జయింది...!

అంతర్మథనం లో 
అంతర్యుద్ధాలు 
మొదలవుతున్నాయి...!!

              ***

కామెంట్‌లు