కన్నె వయస్సు;-భారతి పెద్దపల్లి-కలం స్నేహం
విర జాజి మొగ్గలు వీధి అరుగులపై
విచారమైన బావాలు మోము పైన అచ్చుగుద్దినట్లు అగుపిస్తున్నాయి  
కన్నె వయస్సులో ఆరాట పొరాటలే

రాబోయే కాలంలో కాబోయే వరుని  
కోసం కలలు కంటున్న  కన్నె మొగ్గలు
ఎలా ఉంటాడో తెలియని పరిస్థితి 
భవిష్యత్ గురించి ఆలోచనలు
నిదుర రాకా ఆకాశానికి నిచ్చెనలు
వేస్తూ నిరాశకు లోనౌతూ.

మదిలో ఊహల గానాలు ఊరిస్తుంటే 
కళ్ళల్లో కలవరం కనిపిస్తుంటే మనస్సు మనస్సులో లేక  మౌన వేదన భరిస్తూ బాధలను దిగ మింగుకొని ఆలోచనతో తలమునకలై తల్లడిల్లుతున్నారు

అందాల సుందరీమణులు
రాకుమారుల  రాక కోసం అన్వేషిస్తూ సాంప్రదాయ పద్ధతిగా పరిణయం 
జరగాలని కోరుకుంటారు.

కార్తీక మాసం లో కచ్చితంగా  కలల రాకుమారుడి తోనే కళ్యాణ వేడుక జరుగుతదన్న నమ్మకం మంచిమనసుతో
ఆలోచిస్తే  మంచి  జరుగుతుందని 
వరించే వరుడు చెంత చేరువైన వేళ...
కార్తీక  పౌర్ణమి రోజున తులసి మొక్కకు   కోటి  వత్తులతో అలంకరించి  దీపాలు వెలిగిస్తారు....


కామెంట్‌లు