చూసేవన్ని నిజాలుకావు;-గీతా శ్రీ స్వర్గం--కలం స్నేహం
ట్రాఫిక్ లో ఒక టక్కరి
చుక్కెవరో చూడాలని మనసులో గిలి
అరెరే ఎవరిదీ
చంద్రునిచెల్లియా
మన్మధునికి చెలియా
ఫుల్ ఫేస్ దొరకదేమిటని
పట్టుకోవాలని హల్ చల్
చేస్తోంది గుండెజారి

పెరిగిపోతున్న పెట్రోల్ ధరలా
అతివేగంగా సాగిపోతోంది
అందమైన సుందరి వెనకాల వయసుబాణి 

మధురాశల మంజరిని అందుకోవాలని
పాపం ఆకతాయిఅల్లరికి ఆకలెక్కువై

"వస్తా నీ వెనకా ఎటైనా కాదనక" అని పాడుకుంటూ
ఫాలోయింగ్ కి వింగ్ లు కట్టి పోతానే ఉన్నాడు పోరగాడు

సడన్ గా పడలిందిలే సిగ్నల్
వాహనాలన్ని వెయిటింగ్
చెలి చిత్తరువును చాకచక్యంగ 
ఇక చూసేయాలని
లాంగ్ బ్రీతింగ్ తీసుకుని
అమ్మాయున్న బైకు సైడ్ అద్దంలోకి చూసాడు హీరో
హీరోయిన్ ఉండాల్సిన ప్లేస్ లో 
మాడ్రన్ మెన్ ను చూసి అయ్యాడు జీరో

బ్లూ హెల్మెట్ వేసిన
యూ కట్ హెయిర్ స్టైల్ ని చూసి
పిచ్చిగా పరుగెత్తిన బండికి బుద్ధిలేదంటూ తిట్టుకుని
మెరిసేదంతా బంగారం కాదు
చూసేవన్నీ నిజాలు కావని తెలుసుకుని
జ్ఞానోదయంతో వెనుదిరిగాడు బుల్లోడు


కామెంట్‌లు