మణిపూసలు*;-,*పోతుల చైతన్యభారతి*
కన్నతల్లి మమకారం
భవితకది శ్రీకారం
ఉన్నతంగ నిలబెట్టు
బిడ్డకిచ్చు సహకారం.

మంచి మాటలన్ని విను
అవగాహన పెరిగినను
జ్ఞానంతో పనిచేస్తే
ప్రగతి పథమే నీకును.

నింగిలోని మేఘాలు
మల్లెలా తోరణాలు
అందమైన దృశ్యాలు
నీలి నీలి సొగసులు

వేల వేల పరుగులు
ఒక అడుగుతో మొదలు
చేరేవూ లక్ష్యము
ఆపకోయి పరుగులు


కామెంట్‌లు