ఉగ్రరూపం;-అలేఖ్య రవికాంతి;-కలం స్నేహం
గలగలపారే గంగమ్మ గంభీరమై 
కోపపు కెరటాలతో 
తనలోని అక్కస్సును బుసలుకొడుతుంది
తనలోని అలకలను అలలతో 

జానెడు పొట్ట కూటికై 
బుట్టెడు చెపలకై 
జలమునే నమ్ముకున్న గంగపుత్రులు
గీ దినాము గాబరాపడుతుంటిరి
కన్నెరజేసిన గంగమ్మ పరవళ్ళకి

నేడు గంగమ్మ గర్భంలో దిగితే
శాశ్వతంగా గంగపాలే మత్తడికి
భయపడి వెనుకంజ వేస్తే 
కడుపు పస్తే కొన్నాళ్లకి

కడుపు ఆకలి తీర్చుకోవాలా
తమ కడుపున పుట్టినోరి 
ఆకలి మంట తీర్చాలా
కడలిలో నెమ్మదిగా దిగాలా
నేరుగా కాటికి పోవాలా
ఇంటిని కాపాడుకోవాలా
కన్నోళ్ళకి కడుపుకోత మిగల్చాలా

ఏంటి ఈ దుస్థితి 
అంటూ కన్నీరెట్టుకునేలోపు 
గంగమ్మకు కన్నుకుట్టింది 
ఆనకట్టు తెగింది గండి పడి 
బడుగు జీవులను తనలో 
కలుపేసుకుంది శాశ్వతంగా...!! 


కామెంట్‌లు