సూక్తి పద్యమాల*;-*మిట్టపల్లి పరశురాములు*
దుష్టజనముల చెలిమికి- దూరముండు
నాపదలుకలుగునవని-నరులకెపుడు
నల్లి కాశ్రయమిచ్చిన-నలుగుసోప
చేయవలదుగాచెలిమియు-చేటుగలుగు.

మహినిమనుజుడైజన్మింప-మహిమగాదు
సాటివారిని ప్రేమించ-సమతపెరుగు
మానవత్వమేకైవల్య-మార్గమవగ  

సృష్టిధర్మమ్ముధరణిపై-స్పష్టమగును.
                  ***

కామెంట్‌లు