మేరుపర్వతాన్ని పోలిన కవి;-ముద్దు వెంకటలక్ష్మి=కలం స్నేహం
వివిధ రకాల పూల మొక్కలూ,
 ఫల వృక్షాలు గల ఉద్యానవనము వంటి
 తెలుగు సాహిత్యములో శ్రీనాథమహాకవి
నారికేళ వృక్షము వలె ఠీవిగా
సాక్షాత్కరిస్తాడు ;

బహుళార్థ సాధకమైన ఆ కొబ్బరిచెట్టును పోలి శ్రీనాథుడు
విభిన్న ప్రక్రియలతో రసజ్ఞులను అలరించినాడు ;

పువ్వు పుట్టగానే నరిమళించినట్లు
చిన్నారి పొన్నారి వయసుననే
మరుత్తరాట్చరిత్రను రచించాడు;

రూపుదాల్చిన ఆత్మవిశ్వాసములా
సమకాలీన కవిపండితులను
వాద ప్రతివాదనల్లో ఓడించాడు,
ప్రతిష్ఠకు ప్రతిరూపము వంటి కంచుఢక్కను పగుల గొట్టించినాడు ;

ఆత్మబంధువులా కవితానైపుణ్యముతో ప్రభువును కాపాడినాడు

నారికేళపాకమువంటి నైషథమును మామిడి పండువలె అందించాడు.

కామెంట్‌లు