జామ పండుబాల గేయం-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
రమాదేవి రావమ్మా
రామచిలుక వచ్చింది
జామ పండు తెచ్చింది
మామ చేతికి ఇచ్చింది

నిమ్మలంగా వచ్చాడు
గుమ్మి లోన దాచాడు
అమ్మ నేమో పిలిచాడు
గమ్మున పక్కకు ఉన్నాడు

చిన్న తమ్ముడు చూశాడు
చిన్ని పాపకు చెప్పాడు
గున్న గున్న వచ్చింది
గుమ్మి లోకి దూకింది

జామ పండు తీసింది
గబగబపండు కొరికింది
పొట్టనిండా మెక్కింది
గుమ్మి మిదికి ఎక్కింది


కామెంట్‌లు