నిత్య దీపావళి ...!!;-డా.కె.ల్.వి.ప్రసాద్> హన్మకొండ జిల్లా.
జీవితాన్ని అందరం 
చీకటి వెలుగుల 
చిత్ర రంగుల మయం 
అనుకుందాం ....!
చీకటిని జయించడం
వెలుగు వెన్నెలను-
ఆస్వాదించగలగడం,
నిరాశానిస్ప్రుహలతో
ఎవరికోసమో.....
దేనికోసమో.......
ఎదురుచూసేవాడికి
ఎప్పుడూసాధ్యంకాదు!
కష్టంలోనే -
సుఖం దొరుకుతుందనే 
మూలసూత్రాన్ని నమ్మి 
నిత్యం శ్రమించేవాడికి 
ఈ ఒక్కరోజే కాదు 
ప్రతిరోజూ దీపావళే ...!
మనసునిండా --
ఎప్పుడూఆనంద హేలే........!!

కామెంట్‌లు