తులసీ కళ్యాణం; -కవయిత్రి:-సాహితీసింధు సరళగున్నాల
1.కం*తులసీమాతకు మ్రొక్కుచు
కలిమినిగోరంగస్త్రీలు కలియుగమందున్
పలురకముల పూవులతో
నిలకళ్యాణము సలుపుదురీపౌర్ణమినన్

2.వెలుగుల దివ్వెలు నిండుగ
వెలిగింతురునన్నిదెసల వేవేలుగనే
తలపున భక్తియునింపుక
కలియుగమున జేయుపెళ్ళి కడుశుభమొసగున్

3.బంతులదండలు గూర్చుక
నింతులునోచోటజేరి యిలవెలుగులతో
సంతసమొప్పగ పూజలు
చింతయెమారంగజేయు చిరయశమందున్

కామెంట్‌లు