మహనీయుల వ్యక్తిత్వం!;-అచ్యుతుని రాజ్యశ్రీ
 
1.జగదీష్ పుర్ రాజ్యపాలనలో ప్రధాన పాత్ర పోషించినవాడు హరికిషన్ సింహా!దేశభక్తి స్వామి భక్తికల గొప్ప సాహసి.రాజైన కువర్ సింహ్ ని సుఖదుఃఖాలలో పాలుపంచుకుంటూ1857విప్లవంలో ధైర్యపరాక్రమాలను చూపాడు.రాజు చనిపోయాక వారసుడైన అమరసింహ్ నేపాల్ లో తలదాచుకున్నాడు. నిరాశతోహరికిషన్ బెనారస్ చేరాడు.అక్కడ పోలీస్ శాఖ లోఉన్న రామ్కవి అనేవాడు ఇతన్ని గుర్తించి  అరెస్టు చేసి కలెక్టర్ కి అప్పగించాడు.అతన్ని జగదీష్ పుర్ కి తీసుకుని వెళ్లి బంధుమిత్రులు ఊరివారందరి సమక్షంలో ఉరితీశారు.బంధువులు ఏడుస్తూఉంటే వారి ని  ఓదారుస్తూఇలా అన్నాడు"మీరు ఎందుకు ఏడుస్తున్నారు?మనరాజ్య ధర్మ రక్షణకై నేను వీరమరణం పొందుతున్నాను".
2. రాంప్రసాద్ బిస్మిల్ ని ఆమరునాడు ఉరితీస్తారు అనగా నిశ్చింతగా వ్యాయామం చేస్తుంటే  జైలర్ అడిగాడు "ఏమోయ్!రేపు చస్తావుఅని తెలిసికూడా  దేవుని తలుచుకోక ఇంకా శరీరం కోసం తాపత్రయ పడుతున్నావు ఎందుకు?"దానికి ఆధీరుడు ఇలా అన్నాడు "చూడు బాబూ!ఆభగవంతుడు నన్ను ఆరోగ్యంగా పుట్టించాడు.నాకు మంచి బుద్ధి జ్ఞానం ఇచ్చాడు.నాశరీరం ఆరోగ్యం గా నిశ్చింతగా ఉండాలి. కుళ్ళిపోయిన పళ్లు పూలను దేవుని కి నైవేద్యం పెట్టంగదూ?"అంతే జైలర్ నోరు ఠక్కున మూతబడింది.
3ఒక వ్యక్తి మదన్మోహన్ మాలవ్యాని అడిగాడు "బలమైన ప్రజాస్వామ్యంకి అత్యవసరం ఐంది ఏది?"దానికి ఆయనజవాబు"ప్రతిగ్రామంలో స్కూల్ తో పాటు వ్యాయామ శాల ఉండితీరాలి. శారీరక మంచి ఆరోగ్యం ఉంటేనే  ఉత్తమ పౌరులు బుద్ధివికాసంతో దేశప్రగతికి తోడ్పడగలరు. " మాలవ్యా " సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ "కిఅధ్యక్షులుగా ఉన్న రోజులవి.విపరీతమైన ఎండ వడగాల్పులలో ఒక వాలంటీర్ చెమటలు కక్కుతూ  సమావేశం కి వెళ్లుతున్నాడు."బాబూ! నేను మీ అందరికన్నా పెద్దస్వయంసేవకుడిని.ఎలాంటి భయసంకోచాలు లేకుండా నా గొడుగు నీడలోకి రా! "అని అతనికి  తనే స్వయంగా గొడుగు మోస్తూ నడిచాడు ఆమహాను భావుడు.ఆనాటి జాతీయ నాయకుల పార్టీలు వాదవివాదాలు  పట్టించుకోక"మనమంతా ఒక్కటే!భరతమాతబిడ్డలం"అని వెన్నుతట్టిన మహానుభావుడు మాలవ్యా!

కామెంట్‌లు