*కార్తీక పూర్ణిమ*;-*మాడుగుల మురళీధరశర్మ**కాళేశ్వరం/సిద్ధిపేట*
 *కం:-1*
కార్తికపున్నమిఘనతను
నార్తిగ వివరించనేడు*
నానందమయెన్!
కార్తికమాసమునదిలో
వర్తులదానమ్మునిడుట*
బహుపుణ్యమగున్!
*మత్తేభం:-2*
ఉదయాత్పూర్వముస్నాన,దాన, జపముల్*
ఉత్తేజముప్పొంగగా!
ముదమన్కల్గునుమూర్తిమత్వమదిలో*
పుణ్యమ్ములన్పొందగా!
వదనమ్ముల్వికసించుచుండునెపుడున్*
వైకుంఠసంప్రాప్తికై!
పదసోపానపథమ్మునందుభువిలో*
భవ్యాతిభవ్యమ్ముగా!
*శార్దలం:-3*
దీపారాధన దీపదానములతో*
దివ్యత్వమౌపుణ్యముల్!
ప్రాపున్జేరునుపాపముల్తొలుగగా!
పారీణతాసిధ్ధితో!
శాపమ్ముల్జనుసర్వశాంతికరమౌ*
సంసారసంద్రమ్మునన్!
పాపౌఘమ్మలువీడుకార్తికమునన్*
పర్వంపునీపౌర్ణమిన్!
*సీసం:-4*
సత్యేశువ్రతముతో*
సకలదుఃఖముబాసి!
సర్వశుభమ్ములు*
సంతరించు!
సంధ్యవేళనవెళ్ళి*
సద్భక్తితోడుత!
దీపముల్వెలిగించ*
దేవళమున!
రావి,తులసిచెట్టు,*
రంగనిధామాల!
దీపమ్ముపెట్టగా*
దీప్తికలుగు!
పౌర్ణమి పర్వాన*
పరగజాగారమ్ము!
పలుకోరికలదీర్చు*
భవ్యముగను!
*తే.గీ.:-5*
సత్యనారాయణునిపూజ*
సంతసమ్ము!
దీపజోతితో మనుజులు*
తేజమలరు!
రమ్యకాంతులుజీవికి*
కామ్యమొసగు!
కోరికలుదీర్చుపౌర్ణమి*
కుందనమ్ము!
*కం:-6*
నమకము, చమకముతోడుత
తమకముమీరంగశివుని*
తాదాత్మ్యతతో!
కమనీయపుటభిషేకము
రమణీయముగానభవుని*
రంజిలజేయున్!
*కం:-7*
తులసీదామోదరులను
నెలకొల్పుచురాధకృష్ణు*
నిక్కముప్రక్కన్!
 నెలతలు  కోరుతు కొలిచిన
వలకాడే భర్తనగును*
వాస్తవమొప్పన్!
*కం:-8*
అమలకదానముచేసిన
అమలినదారిద్ర్యభాధ*
లన్నినశించున్!
సుమతిగ లలితా నామము
శ్రమయనకనునర్చనమున*
సంపదలొసగున్!
*కం:-9*
దీపారాధన శివునికి
పాపమ్ములదూరమంపు*
పరిపరివిధముల్!
దీపములోపలనూనెను
కోపమ్మునపోయకలుగు*
గుప్తైశ్వర్యాల్!
*కం:-10*
భవునష్టోత్తరశతముల్
స్తవముగ లింగాష్టకములు*
చదివిన చాలున్!
భవపాపమ్ములుతొలగును
అవనీతలమందుముక్తి*
నందును జీవుల్!
*కం:-11*
వెయ్యెనిమిది వత్తులతో
నెయ్యిని ప్రమిదలలొనింపి*
నేమయుతముగా!
సయ్యనదీపారాధన
చెయ్యగ పాపము హరించు*
జీవామృతమై!
*కం:-12*
నక్షత్రహారతినిగొన
నక్షయమగునావునేతి*
నందునపోయన్!
సాక్షిగదీపారాధన
నీక్షితితిలతైలమిచ్చు*
నీప్సితసిధ్ధుల్!
*కం:-13*
శివపంచాక్షరి మంత్రము
భవరోగములన్నిబాపు*
బ్రహ్మాండముగా!
శివమోంకారసునాదము
శివశివశివయనుచుతలువ*
సిధ్ధులుకలుగున్!
*కం:-14*
మురళీధరుడును,శివుడును
అరమరికలు లేని విధము*
నయ్యప్పగతా!
కరుణనుజూపును సతతము
నిరతిశయానందముగను*
నిజకలిలోనన్!
*కం:-15*
హరిహరుసుతుడయ్యప్పను
కరిమలలోగాంచబూను*
కఠినపుదీక్షల్!
తరతమభేదములెంచక
వరపుత్రుడుకార్తకేయ*
భజనలు సలుపున్!
*కం:-16*
కరిమకరినిగాచినహరి
కరిముఖవరదుండుహరుడు*
కలిసిన రూపున్!
చలినులినెంచనిదీక్షలు
కలికల్మషములనుబాపు*
కార్తికమందున్!

కామెంట్‌లు