దూరపు కొండలు నునుపులు;-అరుణ కుమారి-కలం స్నేహం
పల్లె అంటే చిన్న చూపు
ఏదో బావుకొందామని పట్నం
వైపు పరుగులు
కాలుష్యం నిండిన నగరాలు
హడావుడి జీవనాలు

పక్కవాడు ఎవరో తెలీని వైనం
ఎవడి గోల వాడిదే పట్నంలో
రణగొన ధ్వని శబ్ద తరంగాలు
మైదానం లేని కళా శాలలు

చుక్కలనంటే ధరల పట్టికలు
తాజా కూరలు అసలే ఉండవు
ఇరుకు అద్దె కొంపల్లో జీవనం
జలగల్లా పీడించే ఆసుపత్రులు

వీధి వీధికి సారాయి దుకాణాలు
ఏదో ఒకచోట ధర్నాలు, గొడవలు
చెప్పుకుంటూ పొతే కొల్లలు
నగర జీవితం వద్దు బాబోయ్

చక్కని పంట పొలాలు
ఆప్యాయతనిచ్చే బంధువులు
స్వచ్ఛమైన పవనాలు
తాజా కూరలు, పండ్లు

అవసరం అంటే ఆదుకొనే పొరుగు
ఇచ్చిపుచ్చుకొ

నే అలవాట్లు
ఆటలు ఆడుకొనే జాగాలు
మంచినీటి చెరువులు

గుడిగంటల మేలుకొలుపులు
స్నేహపు చక్కని విలువలు
ఇవన్నీ ఉండే పల్లెలు వదలకు
దూరపు కొండలు నునుపు
పల్లెలే మన భాగ్య సీమలు

కామెంట్‌లు