హాస్య నవ్వులు,;-ఆశ్రీత రెడ్డి--కలం స్నేహం
సూర్యుడి రాక తో విశ్వంఅంతా నవ్వు,
  చిన్నారుల అల్లరి తో అమ్మ పెదవుల్లో నవ్వు...
పక్షుల కిల కిల రాగలతో చెట్లు, వీచే గాలిని చూసి ప్రకృతి నవ్వు..
 పచ్చని పోలాని చూసి రైతు కష్టం లో దాగిన చిరు నవ్వు  ..
 పిల్లగాలి సవ్వడి తో ఆకాశం నవ్వు...☁️
 కెరటాల ఉరుకులతో సముద్రం నవ్వు..
   చందమామ ఆగమనం తో కలువ పువ్వుల నవ్వు...

అనంతమైనది నవ్వు,
అపూర్వం నవ్వు, 
అంతులేనిది నవ్వు, 
అద్భుతం నవ్వు 

దైవం ఇచ్చిన కానుక నవ్వు 
దైనందిన జీవితంలో భాగం కావాలి నవ్వు...
ధైర్యాన్ని ఇస్తుంది నవ్వు...


కోపం తగ్గిస్తూంది నవ్వు, 
కుటుంబంలో అందం నవ్వు....
కవి కలం నుండి జాలువారే అక్షరాలు నవ్వు


కామెంట్‌లు