"వెలుగు దివ్వె" పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం


 పెద్దకడబూర్ మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త , బాలబంధు,గణితోపాధ్యాయుడు గద్వాల సోమన్నను  " వెలుగు దివ్వె " పురస్కారం వరించింది. శ్రీజాదవ్ పుండలిక్ రావు గారు రూపొందించిన  'చిమ్నీలు' తెలుగు సాహిత్య ప్రక్రియలో  శతాధిక కవితలు వ్రాసినందుకు,వారి తెలుగు సాహిత్య కృషిని ప్రశంసిస్తూ  "శ్రీ హంస వాహిని సాహిత్య కళా పీఠం"-భైంసా, నిర్మల్ జిల్లా(తె.రా) వారిచే " వెలుగు దివ్వె " పురస్కారం-2021" గద్వాల సోమన్నకు వాట్సప్ వేదికగా ప్రదానం చేయడమైనది.పురస్కార గ్రహీత గద్వాల సోమన్నను  పాఠశాల ప్రధానోపాధ్యాయులు,తోటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరూ అభినందించారు.


కామెంట్‌లు