దగ్ధమవుతున్న దేహాలు; ప్రతాప్ కౌటిళ్యా ( కె ప్రతాప్ రెడ్డి)
కొండల్ని చేసిన నీరు
సముద్రాల్నీ సృష్టించిన నీరూ
ఆఖరికి ఆవిరైపోతుంది!?

కోడే నాగే కాదు నంది కూడా
మొగలి పొదల్లో కన్నె ఎదల్లో పొంగిపొర్లుతుంది!?

శృంగారాన్ని సృష్టించిన ప్రకృతి
ఆకాశాన్ని నక్షత్రాల్నీ కూడా సృష్టించింది
ఎగిరేందుకే రెక్కలు 
అనుభవించేందుకే శరీరం
మనసును మనిషి మాయంటే
వయసు గాలిలా మిగిలిపోతుంది!?

చీకట్లను నాటిన సూర్యుడు
రేపటి చెట్లకు వెలుగు పూలు పోయించి
చంద్రుని ఇంటి ముందు
ముద్దబంతిలా పెరుగుతాడు!?

పర్వాన్ని కరిగించి సర్వాంగ సుందర్నీ కన్నా
ఆమే ఒక కలకాదు
మిల మిల మెరిసే నక్షత్ర ప్రపంచానికి ఒక లైలా!?
అణువు అణువు తనువే కదా
త్రాగేందుకు అమృతమే కదా అది??

నిమిషమైనా బ్రతికేందుకు విషం త్రాగాలి
క్షణమైన అనుభూతి కోసం మరణించాలి
గుండెల నిండా ప్రేమ ఉండాలి
ఊపిరితిత్తుల నిండా విశ్వాసం ఉండాలి!?

మహావృక్షాల వక్షస్థలాలు కళ్ళు కలువకున్నా
భూమి లోపల వేళ్ళు కాళ్లు కలుసుకుంటే చాలు
కన్నీళ్లు మిగులవూ
రాలుతున్నవీ ఆకులు కాదు రత్నాలు
మిగిలిన పగళ్ళు అన్నీ
రాత్రి స్వప్నంలో కన్నెపిల్లల కలలు!!!?

మేలుకో వలసింది సూర్యుని ఊరు
సుప్రభాతం వినిపిస్తూనే ఉంది
భక్తి ముక్తి గీతం మారింది
ఉప్పొంగే ఉల్లాసం సంతోషం పతాకం ఎగరాలి!?

దగ్ధం అవుతున్న దేహాలతో
దేవుళ్ళు ఆభరణాలు తయారు చేస్తున్నారు
దేహాలు ఇప్పుడు
దగదగ మెరిసే వెండి బంగారు నగలు!!

ఆరిపోయే దీపాలు కాదు
కాలిపోయి యజ్ఞయాగాదులలో
మహా యోధుల్లా మారిన
మహిళలు వారు!!!!?

పూర్ణిమా కు అంకితం
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏❤️🙏
8309529273

కామెంట్‌లు