అమ్మ - జగదీశ్ యామిజాల
అమ్మ 
పుట్టింరోజునాడే కాదు
అమ్మనే మాట 
వింటున్నప్పుడల్లా
గుర్తుకొచ్చే మాటలు....

"పలకమీద నేను రాసిచ్చిన
అ ఆలపైన రాయకుండా
వాటి కింద రాసేవాడివిరా! అన్న అమ్మ మాట
అలాగే
పోనిద్దూ, అలాగైనా రాస్తున్నాడుగా! సంతోషించు అనే నాన్నగారి మాటా!!"

ఇప్పుడనిపిస్తోందమ్మా
ఒక్కసారైనా 
నువ్వు రాసిన అక్షరాలపైన
నేను రాసి ఉంటే బాగుండేదిగా అని

ఇప్పుడేమనుకుని
ఏం లాభం

మాట
మిగిలిపోయింది చిరస్మరణీయమై


కామెంట్‌లు