బ్రతుకుబాట ..!! > దోస్తానా .;-కోరాడ .నరసింహరావు >విశాఖపట్నం.

   ----  10  ---
   ఏ పరిచయాలు ఎప్పుడు... 
ఎలా... ఎందుకు జరుగుతా యో...ఏ బంధాలను వేస్తాయో 
ఏ పరిణామాలకు....... దారితీస్తాయో  , పూర్తిగా....అనుభ వించినాకే బోధపడతాయి !
ఆరోజు...భోజనం చేసేసి పాన్ షాప్ కి వెళుతున్నాను 
"నరసింహా రావ్..."అంటూ ఎవరో పిలిచినట్టనిపించి వెనుకకు చూసాను నవ్వుతూ" నువ్వు ఫోటోస్టూడియోలో పనిచేస్తున్నావా...?" అన్నాడు, 
"ఔను... నువ్వు...!"తనెవరో బోధ పడక చూస్తుంటే..."నేనూ నీతో Rcm...లో నీతోపాటే చదివాను అప్పుడు నువ్వు ఓ రోజు శివతాండవం చేసావు... !"
అంటూ నా ఆఖరి బెంచీ బేచ్ ను గుర్తుచేశాడు !
సిగరెట్లకు  తనే డబ్బులిచ్చాడు 
ఆరకంగా... ఈకొత్తస్నేహం ప్రారంభమైంది....!
వాడి పేరు ధర్మ రాజు... ఒరే అంటే ఒరే అని పిలుచుకునే వాళ్ళం ! తరచూ సినిమాలకు 
వారానికి మూడు, నాలుగు సినిమాలు  చూసేవాళ్ళం... 
మేం జిగ్రీ దోస్తుల మైపోయాం!
తరచూ మాఇంటికి వచ్చేవాడు 
నాముగ్గురు చెళ్ళెళ్ళూ వాడ్నీ అన్నయ్యా అనిపిలిచేవాళ్ళు !
మా చుట్టాల పెళ్ళిళ్ళకీ...మాతాతగారి ఊరు బొబ్బిలిగ్రామదేవత పండగలకి
మేమిద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం, 
గానీ... నా వ్యసనాలేవీ వాడికి 
లేవు... తినటం, సినిమాలు, 
షికార్లు తప్ప ! తరచూ స్టూడియోకి వచ్చి నాతో కాల క్షేపం చేసేవాడు !
ఓ రోజు... "నర్సింగ్ రావ్.... డబ్బులుబాగానేసంపాదిస్తున్నా
మా బంగారప్పని రిస్కె  రా .. !
అందులోకి ఆస్తిపాస్తులేవీ లేని నాలాటోడికి వస్తువులు చెయ్య మని...బంగారమివ్వటానికెవరూ ఇష్టపడరు... అదీగాక యే పోలీసోఎవడ్నో పట్టుకొచ్చి చెప్పురా అక్కడ దొంగిలించిన బంగారం... ఇక్కడేనా అమ్మావు...అనటం... ఆదొంగ ఔననటం... ఆ  బంగారం ఇచ్చెయ్... లేదంటే పద జైల్లో కూచుందువు గాని... ఇలా అప్పుడే... ఇద్దరు, ముగ్గురికి జరిగింది... నాలాంటివాడికి అలాంటి పరిస్థితి వస్తే ఏమైపోతాం... !
అందుకే ఆ పని పూర్తిగా మానేద్దామనుకుంటున్నాను నీలాగే ఫోటోగ్రఫీ నేర్చుకోవా లను కుంటున్నాను... "అంటూ తన మనసులోని మాటను చెప్పాడు ! సరే అందాకా ఖాళీసమయాల్లో రా...  నాతోపాటు డార్క్ రూంకి తీసుకు వెళతాను అనిచెప్పి ఆరకంగా వాడికి కొంత డార్క్ రూంవర్క్ నేర్పేవాడిని !
ఓమారు మేమిద్దరం...నా జూనియర్ రవి,కోమట్లబ్బాయిలు 
ప్రసాదు, కృష్ణ, మరోకుర్రాడు 
మేమంతా కలిసి ఓ మారు విశాఖపట్నం,అరకు సరదాగా తిరిగివచ్చాం...అదోమధురాను  భూతి... !ఇందిరా జూలాజికల్ పార్క్, రామకృష్ణాబీచ్,హార్బర్ 
చూసుకుని అక్కడ ఓ హోటల్ లో కేబరే డాన్సు లుంటాయంటే 
సినిమాల్లో చూడటమే... ప్రత్యక్షంగాచూడబోతున్నందుకు తెగ సంబర పడిపోతూ ఆ రాత్రి ఆసరదాకూడా తీర్చుకుని అరకు ట్రైన్లో బయలుదేరాం !
ట్రైన్ ఆ కొండ గుహల్లోంచి వెళుతుంటే... ట్రైన్లో మేమంతా 
ఉల్లాసంతో అరుపులు !...అరకులో చంద్రమోహన్ సినిమా ఓ పాట షూటింగ్ తో పాటు బుర్రా గుహలుచూస్తూబాగాఎంజాయ్
చేసాం...అవన్నీ  తీపిజ్ఞాపకాలు గా గుర్తుండిపోయాయ్.... !!
                     ************
               *****  సశేషం  *******
కామెంట్‌లు