.నాగరికత ముసుగు;-ఉమామహేశ్వరి యాళ్ళ-విశాఖపట్టణం
కాలం మారిందంటే అభివృద్ధి సొంతమైనదనే
నాగరికులమైనామంటే జ్ఞానం వృద్ధి చెందిందనే
సరికొత్త ఉత్పత్తులు, పరికరాలు కనుగొన్నామంటే
ముందు తరాలకి మంచి బాటలు వేసామనే ..‌....కానీ

నాగరికత ముసుగులో అనాగరికత
అభివృద్ధి మాటున దాగిన దిగజారుడుత
ముందుతరాలకి బాటలు దిశలో మిగిల్చే కాఠిన్యత
మత్తు మాటున దాగిన మన యువత
అసమర్ధులైన మన పోలీసు శాఖ శిక్షల చట్టబద్ధత

కొత్తొక వింతనుకుని భ్రమసే వయసులో
అభివృద్ధి దిశగా కోరినదల్లా అరచేత నిలుస్తుంటే
ప్రపంచ వాణిజ్య మార్కెట్ తళతళల ఆకర్షణలో
చిక్కి శల్యమవుతున్న అనాధలీ యువకులు

తప్పని తెలిసి సమర్ధించుకునే ప్రభుత్వాలు
ఆదాయవనరుగా చూసి విరివిగా అమ్మి
అటు ప్రభుత్వాలు, ఇటు ఆసుపత్రులు లాభపడుతుంటే

ఆశలన్నీ అడియాసలైన తల్లిదండ్రులు
డబ్బులేక సంతాన హీనులైన బడుగులు
మత్తు మాయలో చిక్కి మానసికంగా 
శారీరకంగా భవిష్ఉత్తు కోల్పోతున్న యువకులు

ఆలోచించండి ఉపాధ్యాయులారా
తల్లిదండ్రులారా మరియు ప్రభుత్వమా!!!!!!!


కామెంట్‌లు